ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ విస్తరణలో భాగంగా తన 43వ ఔట్ లెట్ ను వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఏర్పాటు చేశారు. నిజామీ రుచులు, కాకతీయ వైభవపు సమ్మేళనంగా ఈ రెస్టారెంట్ ఉంటుందని, ప్యారడైజ్ అభిమానులు ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అసరం ఉండదని సంస్థ చెబుతోంది.! బిర్యానీ పేరు వినగానే చాలా మందికి ఠక్కున గుర్తొచ్చేది ప్యారడైజ్ బిర్యానీ. హైదరాబాద్ వాసులే కావొచ్చు, వివిధ పనులపై నగరానికి వచ్చి వెళ్లే ఇతర జిల్లాల వాసులు కావొచ్చు ప్యారడైజ్ బిర్యానీకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. బిర్యానీ వడ్డనలో ప్రపంచ రికార్డులను తిరగరాస్తోన్న ప్యారడైజ్ బిర్యానీ మాతృసంస్థ ప్యారడైజ్ ఫుడ్ కోర్టు తాజాగా మరో ఔట్‌లెట్ తెరిచింది. తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ కేంద్రంలో ప్యారడైజ్ తన 43వ ఔట్‌లెట్ ను ప్రారంభించింది. దీనికి సంబంధించి. వేయిస్తంభాల నగరిలోకి ప్యారడైజ్ ప్రవేశించిందంటూ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ సంస్థ సోమవారం ప్రకటన చేసింది. వివరాలివి: ప్రపంచ ప్రసిద్ధ ప్యారడైజ్ బిర్యానీ తమ ఔట్‌లెట్ల జాబితాలో నూతనంగా మరో కేంద్రాన్ని జోడించుకుంది.

ట్రైసిటీ వరంగల్-హన్మకొండ-ఖాజీపేట వాసులకు బిర్యానీ సేవలను మరింత అదుబాటులోకి తెస్తూ, హనమకొండ సుబేదారి, శాస్త్రినగర్‌ మెయిన్‌ రోడ్‌ లో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యారడైజ్ రెస్టారెంట్‌ సేవలను ఆరంభించింది. మూడు నగరాల వాసులు, వరంగల్ రెండు జిల్లాల వాసులతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని బిర్యానీ ప్రియులందరూ ఇకపై ప్యారడైజ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, హన్మకొండలోనే ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.

హన్మకొండలో ప్యారడైజ్ రెస్టారెంట్:

హైదరాబాద్ కు తరచూ వచ్చే విద్యార్థులు, వ్యాపార వేత్తలకు ప్యారడైజ్ బిర్యానీ తినడం ఇష్టమైన పని అని, ఇప్పుడు హన్మకొండలో ఔట్ లెట్ ఏర్పాటు ద్వారా సేవలు మరింత విస్తుృతంగా అందుతాయని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ చైర్మన్ అలీ హేమతి అన్నారు. చారిత్రక నగరమైన వరంగల్ పర్యాటక కేంద్రంగానూ అభివృద్ది చెందిదంని, ఈ తరుణంలో తనకంటూ చరిత్ర కలిగిన ప్యారడైజ్ రావడం సంస్కృతుల సమ్మేళనం లాంటిదని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ డైరెక్టర్ కజీమ్‌ హేమతి అన్నారు. ఇండియాలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ప్యారడైజ్ బిర్యానీ కేంద్రాలు ఉండటం గర్వకారణమని, విస్తరణలో భాగంగా 43వ ఔట్ లెట్ ను హన్మకొండలో ఏర్పాటు చేశామని, కాకతీయుల రాజధాని నగరంలో ఏర్పాటైన ప్యారడైజ్ బిర్యానీ కేంద్రంలో నిజామీ రుచులు, కాకతీయ వైభవపు సమ్మేళనంగా ఇది ఉంటుందని, అత్యుత్తమ ఆహార అనుభూతిని అందిస్తామని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ సీఈవో గౌతమ్‌ గుప్తా తెలిపారు.

ఫుడ్ చైన్ రంగంలో ప్యారడైజ్ సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కడం తెలిసిందే. ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ప్యారడైజ్ ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌, జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది