ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. 26వేల పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నిర్ణయించారన్నారు. రూ.7,289కోట్లతో ‘మన ఊరు  మనబడి’ ప్రణాళిక అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా, బృందానికి అభినందనలు పేర్కొన్నారు.

వాతావరణ మార్పులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. అటవీ, పర్యావరణ విద్య కోసం తొలి వర్సిటీ ఏర్పాటు కానుందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండేలా వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ట్వీట్‌ చేయనున్నారు.