చాలామందికి బస్సు ప్రయాణం పడదు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది . దాని ఫలితంగా వాంతులు అవుతుంటాయి . …ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు, ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది….. ఇలా చాలా మందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి …. అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదంటున్నారు వైద్యులు .

చిన్న అల్లం ముక్కను బుగ్గ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అలంలో కాల్షియం , పాస్పరస్ , మెగ్నీషియం , ఐరన్ , కాపర్ , జింక్ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి ….. వక్కపొడిని చప్పరించినా వాంతుల నుంచి బయట పడవచ్చు . నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు .

లవంగాలు , సోంపు, వంటివి, దవడలో పెట్టుకుని, చప్పరించినా కూడా వాంతులు రాకుండా వుంటాయి . వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు , బస్సు… ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు …