బీటెక్ విద్యార్థి నవీన్‌ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయి కోసం సొంత స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిహర. ఆపై శరీరాన్ని కోసి, గుండె, మర్మంగాలను సైతం కోసి అత్యంత క్రూరంగా హతమార్చాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి హరిహరకృష్ణతో పాటు ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హస్సేన్‌ను విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నవీన్‌ హత్య ఉదంతంపై కూడా రెస్పాండ్‌ అయ్యారు.

సహజంగా ఇలాంటి సెన్సేషన్‌ అంశాలపై వెంటనే రెస్పాండ్‌ అయ్యే వర్మ నవీన్‌ హత్య కేసుపై మాత్రం కాస్త ఆలస్యంగానే స్పందించారు. నవీన్‌ హత్య కేసును ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. హత్యకు గురైన నవీన్‌, నిందితుడు హరిహర కృష్ణతో పాటు నిహారిక ఫొటోను పోస్ట్‌ చేసిన వర్మ ‘అమ్మాయి కోసం ఒక అబ్బాయి తన స్నేహితుడిని అతి కిరాతకంగా చంపాడు. ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదని మాత్రం నాకు తెలియదు’ అని రాసుకొచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్‌ అవుతోంది. వర్మ తీసే లకు ఈ కథ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.