సద్దుల బతుకమ్మ మరియు దసరా సందర్భంగా వరంగల్ సిటి లో ట్రాఫిక్ ఆంక్షలు
తేదీ 06.10.2019 & 08.10.2019 రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.
- ములుగు భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనాలు సైలాని బాబా దర్గా వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
- ఖమ్మం వైపు నుండి వచ్చు భారీ వాహనాలు నాయిడు పంప్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
- నర్సంపేట వైపు నుండి వచ్చు భారీ వాహనాలు గొర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
- హైదరాబాద్ వైపు నుండి వచ్చు భారీ వాహనాలు రాంపుర్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
- కరీంనగర్ వైపు నుండి వచ్చు భారీ వాహనాలు బావుపేట క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
అలాగే వాహనాల రద్దీ మరియు ప్రజల భద్రతను ధృష్టిలో ఉంచుకొని క్రింద నిర్దేశించిన మార్గాలలో వాహనాల రాకపోకలను నియంత్రించబడినవి.
- వరంగల్ రంగలీల మైదాన్ కు వెళ్ళు అన్నీ దారులు.
- ఫోర్ట్ రోడ్ జంక్షన్ నుండి చింతల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వరకు
- భద్రకాళి గుడి నుండి MGM హాస్పిటల్ జంక్షన్ వరకు.
- MGM జంక్షన్ నుండి పోతన రోడ్ వరకు.
- జెమిని సెంటర్ నుండి పాపయ్యపేట చమన్ వరకు.
- వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసు నుండి వరంగల్ చౌరస్తా వరకు.
- చిన్న వడ్డేపల్లి చెరువు దేశాయిపేట నుండి 80 ఫీట్ రోడ్ వరకు.
- గుండు బావి, కొత్తవాడ వరంగల్ ఏరియా.
- పద్మక్షమ్మ గుడి నుండి హనంకొండ చౌరస్తా వరకు.
- వేయి స్తంభాల గుడి రోడ్.
- వడ్డేపల్లి టాంక్ బండ్ నుండి ఫాతిమా జంక్షన్ వరకు.
- బందం చెరువు కాజీపేట రోడ్.
కావున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పండగలు ప్రశాంతంగా జరుగుటకు పోలీసు వారికి సహకరించగలరని కోరుతున్నాము. కమీషనర్ అఫ్ పోలీస్, వరంగల్…