8 రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు :

  • 1 . ఎంగిపూల బతుకమ్మ – 28 . 09 . 19 : మహా అమావాస్య రోజు మొదటి బతుకమ్మ సంబురాన్ని ప్రారంభిస్తారు . తెలంగాణలో దీన్ని పెత్రామస అని అంటారు . నువ్వులు , బియ్యపుపిండి , నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు .
  • 2 . అటుకుల బతుకమ్మ – 29 . 09 . 19 : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండువ రోజు బతుకమ్మ చేస్తారు . సప్పిడి పప్పు , బెల్లం , అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు .
  • 3 . ముద్దపప్పు బతుకమ్మ – 30 . 09 . 19 : ఇక మూడవ రోజు ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు .
  • 4 . నానబియ్యం బతుకమ్మ – 01 . 10 . 19 : నాలుగోరోజు నానేసిన బియ్యం , పాలు , బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు .
  • 5 . అట్ల బతుకమ్మ – 02 . 10 . 19 : ఇక ఐదవ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు .
  • 6 . అలిగిన బతుకమ్మ – 03 . 10 . 19 : ఆరో రోజు ఆశ్వయుజ పంచమి వస్తుంది . నైవేద్యం ఏమీ సమర్పించరు .
  • 7 . వెన్న ముద్దల బతుకమ్మ – 04 . 10 . 19 : ఇక ఏడవ రోజు నువ్వులు , వెన్న కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు .
  • 8 . సద్దుల బతుకమ్మ – 05 . 10 . 19 : ఎనిమిదవ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు . మొత్తం ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు . పెరుగన్నం , చింతపండు పులిహోర , లెమన్ రైస్ , కొబ్బరన్నం , నువ్వులన్నం ప్రత్యేకంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు .