ఇల్లరికం అల్లుడైన అక్క భర్త పాటిబండ్ల సుధాకర్ కొంతకాలంగా మౌనికను లైంగికంగా వేధిస్తున్నాడు. అంతేకాదు, తననే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
డిగ్రీ విద్యార్థిని మౌనిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బావ వేధింపులు తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇల్లరికం అల్లుడైన అక్క భర్త పాటిబండ్ల సుధాకర్ కొంతకాలంగా మౌనికను లైంగికంగా వేధిస్తున్నాడు. అంతేకాదు, తననే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక మౌనిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.