ముందు చదువుకుని జీవితంలో స్థిరపడాలనేవారు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత కూడా చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లేవారిని చాలా తక్కువగా చూస్తుంటాం. ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఓ జంట ఈ కోవకే చెందుతారు. పెళ్లి చేసుకుని చదువుకున్నారు. రాష్ట్రపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో తొలి, రెండు ర్యాంకులు సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌, భార్య విభాసింగ్‌ ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమయ్యారు. చదువులో ఒకరినొకరు సహాయం చేసుకున్నారు. ఇటీవల చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ)కు పరీక్ష నిర్వహించగా వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. భర్త అనుభవ్‌కు 298 మార్కులు రాగా భార్య విభా సింగ్‌కు 283 మార్కులు వచ్చాయి.