ఇది బీహార్‌లోని భాగల్‌పూర్‌‌కు చెందిన ఒక మహిళ కథ!! వివరాల్లోకి వెళితే జగదీష్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక మహిళ ఇటీవల భాగల్‌పూర్ జోన్ డీఐజీ వికాస్ వైభవ్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకుంది. తన సోదరుడు గత ఏడు నెలలుగా కోల్‌కతాలో ఉంటున్నడని, ఇటువంటి సమయంలో తన వదిన గర్భం దాల్చిందని, ఇదెలా జరిగిందో తెలియడం లేదని పేర్కొంది. అందుకే తన వదిన కడుపులో పెరుగుతున్న శిశువుకు సంబంధించి డిఎన్ఏ టెస్టు చేయాలని కోరింది.

కాగా ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో గర్భం దాల్చిన నేపధ్యంలో అటు అత్తారింటివారు, ఇటు పుట్టింటివారు ఆమెను సంరక్షించేందుకు ముందుకు రావడం లేదు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతంపై గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేసి, ఆ మహిళను ప్రశ్నించగా, తన కడుపులో పెరుగుతున్న శిశువుకు తన భర్తే కారకుడని, తరచూ భర్త తన కలలోకి వస్తుంటాడని అందుకే గర్భం దాల్చానని తెలిపింది.

అయితే ఆమె చెప్పిన సమాధానంపై అనుమానం తలెత్తడంతో గ్రామ పెద్దలు ఆమె మొబైల్ ఫోనును చెక్ చేశారు. దీంతో ఒక యువకునితో ఆమె తరచూ మాట్లాడుతున్నట్లు కాల్‌లిస్టులో ఉంది. దీంతో ఆ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు….