మంచు మనోజ్ కొన్ని రోజులుగా సినిమాల్లో కూడా కనిపించడం లేదు. దానికి చాలా కారణాలున్నాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు మనోజ్. తన వ్యక్తిగత జీవితంలో అలాగే ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో జరిగిన కొన్ని విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. ఈయన వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈయన విడాకులు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాడు మనోజ్. తమ విడాకుల ప్రక్రియ పూర్తయిందని బరువైన హృదయంతో మీకు తెలియజేస్తున్నాను అంటూ ఓ లేఖను విడుదల చేసాడు మనోజ్.

రెండేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలికామని తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని వాటి వల్ల చాలా నొప్పిని కూడా అనుభవించామని తెలియజేసాడు మనోజ్. ఎంతో వేదన తర్వాత ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకున్నామని చెప్పాడు ఈయన. విడిపోయినా కూడా ఇద్దరం ఒకరిని ఒకరం ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉంటామని తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని అలాగే తమ వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నాము అంటూ లేఖ రాసాడు మంచు వారబ్బాయి.

అలాగే కొన్ని రోజులుగా తన హృదయం సరైన స్థానంలో లేదని అందుకే నటనపై కూడా దృష్టి పెట్టలేకపోయానని చెప్పాడు ఈయన. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కుటుంబం, స్నేహితులు ముఖ్యంగా ప్రాణానికి ప్రాణమైన అభిమానులు తనకు అండగా నిలిచారని చెప్పాడు ఈ హీరో. వాళ్ల సపోర్ట్ నేనెప్పుడూ మరచిపోనని వాళ్లు లేకపోతే తాను ఈ రోజు ఈ స్థితికి వచ్చే వాడిని కాదని చెప్పాడు. తను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు మనోజ్. ఇక ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నానని ఇప్పుడు తన ముందున్న లక్ష్యం సినిమాల్లో నటించడం మాత్రమే అని చెప్పాడు మనోజ్. తన జీవితంలో సినిమాలు ప్రాణంగా నిలిచాయని చివరి వరకు నటిస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు….