అమెరికాలో ఆడామగ మధ్య వ్యత్యాసం ఎందుకు ? అని ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు . ఎండాకాలంలో ఉక్కపోతను తట్టుకోలేక పురుషులు ఒంటిపై షర్టు తీసుకుని తిరుగుతారు . మరి స్త్రీలు ఎందుకు స్తనాలు కన్పించకుండా కప్పుకోవాలి ? అని తమ పిటిషన్లో పేర్కొన్నారు . తమకు కూడా ఉక్కపోస్తుందని తమకూ ఆ స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు . దీంతో కోర్టు వారి వాదనలో న్యాయం వుందని భావించి సంచలన తీర్పు వెలువరించింది .

మహిళలు టాప్ లెస్ గా తిరగొచ్చని తీర్పు ఇచ్చేసింది . ఉటా , కొలరాడో , వోమింగ్ , న్యూమెక్సికో , కన్సాస్ , ఒక్లహామా రాష్ట్రాల్లో మహిళలు ఎదపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది . ప్లెయింటిప్స్ బ్రిట్ హోగ్లాండ్ , సమంతా సిక్స్ అనే ఇద్దరు మహిళలు కోర్టులో దావా వేశారు . FreeTheNipple అనే ఉద్యమాన్ని వారు చాలా ముందుకు తీసుకువెళ్లారు . మహిళలు పబ్లిక్ లో టాప్ లెస్ గా తిరగనివ్వకపోవడం అంటే వారి స్వేచ్ఛకు , లింగ సమానత్వానికి భంగం కలిగించినట్టేనని వారిద్దరు మహిళలు వాదించారు . అబ్బాయిలు , అమ్మాయిల మధ్య భేదం ఎందుకు ? అని కోర్టును ప్రశ్నించారు . వారి వాదనతో కోర్టు ఏకీభవించింది .

ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద మార్పునకు దారి తీస్తాయని కోర్టు అభిప్రాయపడింది . మహిళలను టాప్ లెస్ గా తిరగనివ్వకపోవడం వల్ల ఆడవారి దేహం , స్థనాలు అంటే కేవలం శృంగారానికి సంబంధించినవి అనే భావన ఏర్పడుతుందని కోర్టు భావించింది . ఈ అభిప్రాయం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం కోసమైనా టాప్ లెస్గా తిరగడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది . స్థానిక కోర్టు తీర్పును అక్కడి ప్రభుత్వం కూడా వ్యతిరేకించలేదు . సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కోర్టు తీర్పును అంగీకరించింది .