మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా మూడున్నర నెలల గడువు మాత్రమే ఉంది. నాలుగు రోజుల జాతరకు దేశవ్యాప్తంగా కోటి మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. మరోవైపు మేడారం పరిసరాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పనీ మొదలుపెట్టలేదు. రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తాగునీరందించడానికి ప్రతి జాతరలో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది.

తాత్కాలిక సేవలు అందిస్తోంది. ట్యాంకర్ల ద్వారా లేదా చేతి పంపులు వేయడం, 2, 5 వేల లీటర్ల ప్లాస్టిక్‌‌ట్యాంక్‌‌లు ఏర్పాటు చేయడం వటి పనులు చేసేవాళ్లు. జాతర అయిపోగానే వాటిని తొలగించేవాళ్లు. ఈసారి జాతరలో పర్మినెంట్‌‌గా వాటర్ ట్యాంక్‌‌లు నిర్మించి భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఆర్‌‌డబ్ల్యుఎస్‌ ‌ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

చిలుకల గుట్ట సమీపంలోని ఎదురుకోళ్లు, తాడిచెట్లు, పోలీస్‌‌క్యాంప్‌‌ ఆఫీస్‌‌, రెడ్డి గూడెం, ఊరట్టం, భాషగూడెం, కన్నెపల్లి స్తూపం, శివరాంసాగర్‌‌, వనం రోడ్డు, కన్నెపల్లి, తిరుమల హాస్పిటల్‌‌, కొంగలమడుగు, నార్లాపూర్‌‌, చింతల్‌‌క్రాస్‌‌రోడ్డు వద్ద 500 కిలో లీటర్ల సామర్థ్యం గల 14 వాటర్‌‌ట్యాంక్‌‌లు, మేడారం జాతర పరిసరాలు మొత్తం కలిపి 16,400 మీటర్ల పైప్‌‌లైన్‌ ‌నిర్మాణానికి రూ.20.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించింది. నిధులు మాత్రం రాలేదు…

Okka pani modalu kale