నిందితుడు చాంద్రాయణగుట్ట నగరంలో జీవనోపాధికోసం ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత యువతికి మొబైల్ షాపులోనే పరిచయం ఏర్పడి, అతడితో ప్రేమలో పడింది. అయితే నిందితుడు ఆమెను ఈ నెల 9న తనకు తెలిసిన వారింటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం పెళ్లిచేసుకోమని యువతి కోరగా, అందుకు అతడు ససేమిరా అన్నాడు. కాగా బాధిత యువతి నివాసం ఉంటున్న ఇంట్లోనే మరో యువకుడు సైతం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే అదే ఇంట్లో ఉన్న ఓ మహిళ మొదటి నిందితుడుతో బాలికను ఎవరికీ అనుమానం రాకుండా యూపీకి పంపించింది. కాగా బాధిత యువతి కుటుంబ సభ్యులు యువతి కనిపించడంలో లేదని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూపీలో బాధిత యువతిని నిందితుడి చెరనుంచి విడిపించారు. అనంతరం యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు వారికి సహకరించిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు…