ఏపీలో దిశ చట్టం అమలైన తరువాత మహిళలు అంతా తమను ఎవరైనా వేధిస్తే 21 రోజులలో న్యాయం జరుగుతుందని భావిస్తుండగా, దిశా చట్టం వచ్చి దాదాపుగా వారం రోజులు కూడా కాకుండానే ఒక మహిళకు జరిగిన అన్యాయంతో ఆ గ్రామస్తులంతా ఒక్కటై పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ఒక మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా వీడియో తీసాడు. ఆ విషయాన్ని ఆ మహిళ పసిగట్టి పట్టుకోవాలని చూస్తే పారిపోయాడు. కానీ అతడి ఫోన్ మాత్రం లాక్కోగలిగింది. ఆ ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ పోలీసులు 11 గంటలకు వెళితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూర్చోపెట్టి నామమాత్రంగా కేసు నమోదు చేయడం జరిగింది.

దీనితో పాటు ఆ మహిళ పట్ల జాలి చూపించకుండా అతడు కనపడైతే చెప్పమని ఆ ఫోన్ తీసుకోవడం జరిగింది. దీనితో ఆ మహిళ ఊరిలో పెద్దల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లడంతో అప్పటికే ఫోన్ SI మాయం చేసినట్లు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తూ వీడియో తీసిన వెధవకు కొమ్ముకాస్తున్నారని ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొని వెళ్లడంతో నిందితుడిపై పోలీస్ కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.