రష్మికకు పెద్ద కలలు ఉన్నాయి. నాకు తన గతం తెలుసు

రష్మికను ఇబ్బందిపెట్టకండి, తనని సంతోషంగా ఉండనివ్వండి అని అంటున్నారు కన్నడ నటుడు ర¤క్షిత్‌ శెట్టి. ‘కిర్రాక్‌పార్టీ’ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట 2017లో నిశ్చితార్థం చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రష్మిక-రక్షిత్‌ గతేడాది విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు వృత్తిపరంగా చాలా బిజీగా లైఫ్‌ను గడుపుతున్నారు. తాజాగా రక్షిత్‌ ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా ఆయన చెన్నైలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ‘రష్మికకు పెద్ద కలలు ఉన్నాయి. నాకు తన గతం తెలుసు. శాంటా తన కలలను సాకారం చేయాలని కోరుకుంటున్నాను’అని రక్షిత్‌ అన్నారు. అనంతరం తన అభిమానులు రష్మికను సోషల్‌మీడియాలో టార్గెట్‌ చేయడంపై రక్షిత్‌ స్పందించారు. ‘రష్మిక మీద మీరందరూ ఓ అభిప్రాయాన్ని ఏర్పర్చుకున్నారు. అందుకే నేను ఎవర్ని నిందిచడం లేదు. గత రెండు సంవత్సరాల నుంచి రష్మిక నాకు తెలుసు. అలాగే మీకంటే ఎక్కువగా నాకు తన గురించి తెలుసు. తనని జడ్జ్‌ చేయడం మానండి. దయచేసి తనని సంతోషంగా ఉండనివ్వండి’ అని రక్షిత్‌ కోరారు.