శీతాకాల విడిది కోసం ఈరోజు హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము గారికి సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను, అధికారులను పేరుపేరునా రాష్ట్రపతి గారికి సీఎం పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ శ్రీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీ కె.టి.రామారావు, శ్రీ టి.హరీశ్ రావు, శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ జి.జగదీష్ రెడ్డి, శ్రీ ఎస్.నిరంజన్ రెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ సీహెచ్.మల్లారెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ శ్రీ కె.కేశవరావు, లోక్ సభ ఎంపీ శ్రీ నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొని, రాష్ట్రపతి ముర్ముకు గారికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులందరూ రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకడంతో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సందడి నెలకొన్నది.