కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీకి చెందిన స్టార్లపై ఆరోపణలు చేసింది . దర్శకులు , నటులు , నిర్మాతలు ఇలా ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు . తనకు అన్ని విషయాలు తెలుసునంటూ రెచ్చిపోతుంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఒక నటితో ఎఫైర్ ఉందంటూ ఆ నటిపై దారుణ కామెంట్స్ చేసింది . సదరు నటి భర్తను సైతం వదలకుండా ఫోటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదానికి తెర లేపింది .

ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఎఫైర్ ఉందంటూ పెద్ద పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి , ఇందులో రోజా క్యారెక్టర్ ని తక్కువ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది . రోజాకి నటి ప్రవీణ భర్త అనీల్ తో ఎఫైర్ ఉండేదని డబ్బుల కోసం రోజా అతడిని గోకేదని డబ్బున్న వాళ్లను పరిచయం చేయమని అనీల్ ని అడిగేదని ఇలా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి . ‘ రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు , మిమ్మల్ని కించపరచాలని కాదు మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం

మీ రచ్చబండ లేదా బతుకు జట్కా బండికి వాళ్లను పిలవండి . నేనూ కూడా వస్తా ‘ అంటూ వరుస పోస్ట్ లు పెట్టింది శ్రీరెడ్డి , రోజాపై ఇలాంటి ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తేమీ కాదు గతంలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ అప్పుడు కూడా రొహిని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది..