వరంగల్‌ బట్టల బజార్‌, రైల్వే గేట్‌ వద్ద ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం పనులు జరుగుతున్న దృష్యా ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం జరిగే ప్రాంతంలో ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ సోమవారం ట్రాఫిక్‌ అడ్వైజరీ విడుదల చేసారు. బట్టలబజార్‌లోని రైల్వేగేట్‌ నెంబర్‌ 62 లేవిల్‌ క్రాసింగ్‌ ఆర్‌.ఓ.బి నెం 480/బి వద్ద.

ఈ నెల 08-01-19వ నుండి 10-01-19 తేది వరకు ఓవర్‌ బ్రిడ్జ్‌ పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు జరుగుతుందడంతో ఈ ప్రాంతంలో వాహనదారులకు ఏలాంటి ఇబ్బందులకు గురికాకుండా వుండడంతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకోని మరియు ట్రాఫిక్‌ నియంత్రించడం కోసం, వరంగల్‌ రైల్వేగేట్‌ బైపాస్‌ రోడ్‌ను పూర్తిగా మూసి వేస్తుండంతో ఈ క్రింది ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు మరియు క్రమబద్దీకరణ జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ఈ విధంగా ట్రాఫిక్‌ మళ్ళింపు జరిగే ప్రాంతాలు

  1. రైల్వేగేట్‌ బైపాస్‌ రోడ్‌ మార్గానికి వేళ్ళేందుకు వినియోగించే పోతన జంక్షన్‌, అండర్‌బ్రిడ్జ్‌, బీట్‌ బజార్‌, మేడరవాడ మార్గాలను పూర్తిగా మూసివేయడం జరుగుతుంది.
  2. ఖమ్మం మరియు ఆపై మార్గాల మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీవాహనాలు ఫోర్ట్‌ రోడ్‌ నుండి చింతల్‌ బ్రిడ్జ్‌, తెలంగాణ జంక్షన్‌ నుండి మళ్లించబడుతుంది.
  3. రైల్వేగేట్‌ బైపాస్‌ మార్గం నుండి వేళ్ళే లోకల్‌ ఆర్టీసీ బస్సులను వరంగల్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ ,వరంగల్‌ చౌరస్తా, పోచమ్మమైదాన్‌, యం.జి.యం, జెమిని థియేటర్‌ మీదుగా మళ్లించబడుతుంది. అధే విధంగా ఇదే మార్గంలోవచ్చే లోకల్‌ ఆర్టీసీ బస్సు తిరిగి పోతన జంక్షన్‌ మళ్ళీంచి యం.జి.యం మీదుగా పంపబడును.
  4. ఖమ్మం మరియు అపై మార్గాల నుండి హంటర్‌ మరియు చిన్న బ్రిడ్జ్‌ మీదుగా వచ్చే వాహనాలు పోతన జంక్షన్‌ నుండి యం.జి.యం వైపు మళ్ళించబడుతాయి.
  5. కావున ప్రజల ట్రాఫిక్‌ పోలీసులు సూచించిన మార్గాల మీదుగా వాహనదారులు తమ గమ్య స్థానాలకు చేరుకోని ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించగలరు అని తేలిపారు…