కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ జిల్లాలో పరిశ్రమ స్థాపనకు క్రియాశీలక పాత్ర పోషించినందుకు రాష్ట్ర పరిశ్రమల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్, జె పాటిల్ అందుకున్నారు. హైదరాబాద్ శిల్పారామంలో బుధవారం ఉదయం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది టీఎస్ ఐపాస్ జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా పారదర్శక ప్రతిష్టాత్మక అమలులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు ప్రకటించింది.

గత ఐదేళ్లలో కూడా టీఎస్ ఐపాస్ లో పరిశ్రమల స్థాపనకు నిబంధనల మేరకు 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేయడం వలన ఈ అవార్డు దక్కింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చరిత్రలోనే ఈ అవార్డును పొందినందున, పట్టణాభివృద్ధి సంస్థ పురోగతి పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డితో పాటు ఇన్చార్జి వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ఉత్తమ పురస్కారాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా స్వీకరించారు