నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసారు. నిందితుల నుండి సుమారు 11వేల రూపాయల విలువగల నకిలీ నోట్లపాటు, నోట్ల ముద్రణకు వినియోగించే రెండు ల్యాప్‌టాప్‌లు, కలర్‌ ప్రింటర్‌ తో పాటు పెపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అరెస్టు చేసిన వారిలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా, ఐనవోలుప్రాంతానికి చెందిన పల్లకొండ కుమారస్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామవరం గ్రామానికి చెందిన కోలా దుర్గా ప్రసాద్‌, వరంగల్‌ రంగంపేట్‌ ప్రాంతానికి చెందిన యం.డి కరీం హుస్సేన్‌ వున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి టాస్క్‌ఫోర్‌ ఎ.సి.పి చక్రవర్తి వివరాలను వెల్లడిస్తూ కోద్ది రోజులుగా ఆరోగ్య సమస్యతో భాధపడుతున్న నిందితుడు పల్లకొండ కుమారస్వామి చికిత్స నిమిత్తం జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లా కేంద్రంలో ఆయుర్వేద హస్పటల్‌తో పాటు, బోగ్గుబావి విధులు నిర్వహించే కొలా మురళీమోహన్‌ వద్దకు చికిత్స పోందాడు.

ఈ సమయంలోనే నిందితుడు కుమారస్వామికి కొలా మురళీమోహన్‌ అన్నయ్య ఆయిన మరో నిందితుడు కోలా దుర్గాప్రసాద్‌ పరిచయడంతో పాటు, ఈ ఇద్దరి నిందితుల మధ్య స్నేహం కదరటంతో ఇద్దరు జల్సాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితులకు తమ జల్సాలకు అవసరమయిన డబ్బు సరిపోకపొవడంతో నిందితులలో ఒకడైన దుర్గాప్రసాద్‌ తను నకిలీ నోట్లను తయారు చేయడం తనకు తెలుసని నకిలీ నోట్లను ముద్రించడం ద్వారా సులభంగా డబ్బును సంపాదించవచ్చని తెలపడంతో, నిందితుడు కుమారస్వామి తన ఇంటిలో నకిలీ నోట్లను ముద్రించేందుకు అంగీకరించాడు. దినితో నిందితులు ఇద్దరు నకిలీ నోట్ల తయారీకి అవసరయిన ల్యాప్‌టాప్‌, కలర్‌ ప్రింటర్‌తో పాటు ఇతర సామగ్రి కోనుగొలు చేయడంతో పాటు, 50వేల రూపాల నకిలీ నోట్ల ముద్రణకు సిద్దపడ్డారు. ఈ క్రయంలో నకిలీ నోట్ల ముద్రణకు వినియోగిస్తున్న ల్యాప్‌టాప్‌కు సాంకేతిక సమస్య రావడంతో మరో ల్యాప్‌టాప్‌ కోసం నిందితుడైన కుమారస్వామి స్నేహితుడైన మరో నిందితుడు కరీం హుస్సెన్‌ను నిందితులు సంప్రదించడంతో, నకిలీ నోట్ల ముద్రణలో తనను కూడా భాగస్వాముడిగా చేర్చుకుంటే ల్యాప్‌టాప్‌ అందజేస్తానని తెలిపడంతో కరీం, అందజేసిన ల్యాప్‌టాప్‌ ద్వారా నిందితులు 50వేల రూపాయల విలువ గల నకిలీ కరెస్సీని ముద్రించగా అందులో కేవలం 11వేల 100రూపాయలు మాత్రమే అసలు నోట్లతో సరిపొవడం జరిగింది.

ఈ నకిలీ నోట్ల ముద్రణకు సంబంధించి ఈ రోజు ఉదయం టాస్క్‌ఫోర్స్‌ ఏ.సి.పికి సమాచారం రావడంలో ఏ.సి.పి అదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌ తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోని నకిలీనోట్లతో పాటు, ఇందుకోసం వినియోగించే సామగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఎ.సి.సి చక్రవర్తి, ఇన్స్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్‌ఇ సోమలింగం, కానిస్టేబుళ్ళు రంజిత్‌, మహేందర్‌, రాజేష్‌లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ అభినందించారు.వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్ ఫోర్స్ కార్యాలయము