వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ లోని ఓ తాటి చెట్టుపై శనివారం సాయంత్రం పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో చుట్టుపక్కల నివాసితులు హడలిపోయారు. ఒక్కసారిగా వేల వాట్స్‌ లైట్లు వెలిగినట్టుగా నివాసాల ముందు వెలుగు, శబ్ధం రావడంతో ప్రజలు బయందోళనకు గురయ్యారు. తాటి చెట్టుపై పిడుగు పడి చెట్టు మధ్యలో చీల్చుకుంటు వెళ్ళడంతో తాటిచెట్టు కాలుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నెక్కొండ లోనీ అప్నాబజార్ కాలనీ వాసులు పిడుగు పడిన మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. పిడుగు పడే సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగుపాటుతో అప్నాబజార్ లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.