మిషన్ భగీరథ పెండింగ్ పనులను త్వరితంగా పూర్తి చేయాలని మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ శ్రీధర్ ను కోరారు. మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ శ్రీధర్ నగర మేయర్ ను బల్దియా ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వచ్చే వేసవిలో మహా నగర ప్రజలకు ప్రతి రోజు క్రమం తప్పకుండా స్వచ్చ నిరందించేలా చర్యలు తీసుకోవాలని మేయర్ కోరారు. అదే విధంగా నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనుల ప్రగతిపై ఏ ఎన్ సి తో మేయర్ చర్చించారు.
ఈ సందర్భంగా ఈ.ఎన్.సి నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి ని మేయర్ కు వివరించారు. కాకతీయ వైద్య కళాశాల లో, గోపాల్ పూర్ నిర్మాణం లో ఉన్న వాటర్ ట్యాంక్ లు మార్చి నెలలోగా పూర్తవుతాయని, రోడ్డు రెస్టారేషన్ పనులు త్వరలో పూర్తి చేస్తామని, పెండింగ్ పనులను 10రోజుల్లో పూర్తవుతాయని మేయర్ కు వివరించారు.
ట్రాఫిక్ కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పనులను ముందుగా పూర్తి చేయాలని మేయర్ కోరగా త్వరలోనే అట్టి పనులను పూర్తి చేస్తామన్నారు. అంతకు ముందు శ్రీధర్ ఉదయం నగర పర్యటనలో భాగంగా ఈ.ఎన్. సి ముఖ్యంగా భిమారం, ఎం జి ఓస్ కాలనీ, బట్టల బజార్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనుల పురోగతిని పరిశీలించారు. అదేవిధంగా శివనగర్ లోని బాక్స్ డ్రైన్ ను పరిశీలించారు. పైప్ లైన్ పనులను చేపట్టాలని, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో కొనసాగుతున్న రహదారుల, పైప్ లైన్ పనులను, శివ నగర్ లో నిర్మాణంలో ఉన్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ ను పరిశీలించారు. కాకతీయ యూనివర్సిటీ ప్రాంతం లోగల రా వాటర్ ఫిల్టర్ వాల్వ్ ను పరిశీలించిన ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ సమర్థవంతం గా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. శ్రీనివాస రావు, బల్దియా ఎస్.ఈ. సత్యనారాయణ, ఈ.ఈ లు, డి.ఈ.లు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.