వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా పని చేస్తున్న IAS అధికారిగా పని చేస్తున్న గౌతమ్ ను రెండు రోజుల క్రితం ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ.. మంగళవారం కాళోజి విగ్రహం ఎదుట స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిజాయతీ గల అధికారులను బదిలీ చేయడం దారుణమన్నారు. అధికారి గౌతమ్‌ను బదిలీ చేయడం ఆపకపోతే వరంగల్ నగర అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు.
వెంటనే బదిలీ ఉత్తర్వులను ఆపాలని డిమాండ్ చేశారు.

నిక్కచ్చిగా వ్యవహరించడమే కారణమా ?

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు రిటర్నింగ్ అధికారిగా కమిషనర్ గౌతమ్ బాధ్యతలు నిర్వర్తించారు . వరంగల్ నగర పరిధిలో అవినీతి , ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడంతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ గా ఆయన నిక్చచ్చిగా వ్యవహరించిన ఘటనలు ఉన్నాయి . ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేపించినట్లు ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి .

రెండు రోజుల క్రితం మేయర్ ఎంపికపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం కావడం మర్నాడు కమిషనర్ బదిలీ అవుతూ ఉత్తర్వులు వెలువడడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది . స్వచ్చ సర్వేక్షణ్లో వరంగల్ ఇతర 500 పై చిలుకు నగరాలు , పట్టణాలతో పోటీ పడుతోంది . ఈ క్రమంలో యువ IAS అధికారి గౌతమ్ ను బదిలీ చేయడంపై ప్రభావం మహా నగరంపై పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . కీలక ప్రాజెక్టుల పురోగతి వేగవంతంగా ముందుకు సాగుతున్న స్థితిలో కమిషనర్ ను సాగనంపడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి .