ఊమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా లారీలో ఉన్న గ్రానైట్ రాయి దొర్లుకుంటూ వచ్చి ఆ ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే, ఈ కూలీలంతా చిన్నగూడురు మండలం మంగోరి గూడెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉండగా మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లారీలో తీసుకెళ్తున్న గ్రానైట్ బండ జారీ దాని వెనుకే వెళ్తున్న ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, మృతులంతా చిన్నగూడురు మండలం మంగోరి గూడెంకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.

కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగోరి గూడెంకు చెందిన 11 మంది కూలీలు పనులకు వెళ్లి ఓ ఆటోలో తిరిగి వస్తున్నారు. కాగా, అదే సమయంలో గ్రానైడ్ బండల లోడ్‌తో ఓ లారీ వెళ్తోంది. లారీలో గ్రానైట్ బండను సరిగ్గా కట్టకపోవటంతో బండ దొర్లుకుంటూ వచ్చి కింద పడింది. ఈ క్రమంలోనే లారీ వెనుక వెళ్తోన్న ఆటోపై ఒక్కసారిగా బండ పడింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మిగతా వాళ్లు తీవ్రంగా గాయపడగా వాళ్లను సమీప ఆస్పత్రికి తరలిస్తోన్న క్రమంలోనే మరో ఇద్దరు కూడా ప్రాణాలు వదిలారు. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరిని పోలీసులు క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు. అసలు ఘటనకు గల కారణాలేంటీ బండరాయి ఎలా పడింది అనే అంశాలపై విచారణ చేపట్టారు. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.