వాట్సాప్ గ్రూప్ లో అశ్లిల చిత్రాలు ! కళాశాలలోని ఓ సూపరింటెండెంట్‌ వీటిని పోస్టు చేసినట్లు తెలిసింది. వందలాది అధ్యాపకులు, ఉన్నతాధికారులు, మహిళాఅధ్యాపకులు, ఉద్యోగినులు సభ్యులుగా ఉండే ఈ గ్రూప్‌లో వాటిని పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. కళాశాలలో అధికారులు, ఉద్యోగులకు సమాచారం అందించడం, ఇతర సౌలభ్యం కోసం ఆర్ట్స్‌ కాలేజి స్టాఫ్‌ క్లబ్‌ పేరుతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేశారు. ఏదైనా ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చినా, సమావేశాలు నిర్వహించదలచుకున్నా ఇందులో పోస్ట్‌ చేసి సమాచారం చేరవేస్తారు. ఇది ఒకరకంగా కళాశాల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ అనే చెప్పాలి. అలాంటి గ్రూప్‌లో ,ఓ సూపరింటెండెంట్‌ పలు నీలిచిత్రాల వీడియోలు పోస్టు చేయడంపై పలువురు మహిళాఅధ్యాపకులు, ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళాఉద్యోగులు, అధికారులు ఉంటారనే చిన్నపాటి జ్ఞానం కూడా లేకుండా ఇలా పోస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పలువురు మహిళాఅధ్యాపకులు వెంటనే గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అయినట్లు సమాచారం.
వైరల్‌ అయిన మాట వాస్తవమే: రంగస్వామి, ప్రిన్సిపాల్‌ : వాట్సాప్‌ గ్రూపులో నీలిచిత్రాల వీడియోలు వైరల్‌ అయిన మాట వాస్తవమే. పొరపాటున పిల్లలు వాటిని పోస్టు చేసినట్లు ఆ సూపరింటెండెంట్‌ అంగీకరించాడు. వెంటనే డిలీట్‌ చేయవలసిందిగా చెప్పినట్లు ఆ ఉద్యోగి నాతో తెలిపాడు. ఆ సంఘటన పొరపాటున జరిగినట్లు తెలుస్తోంది.