{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1641706410856","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"version":1,"sources":[{"id":"361966122025900","type":"premium"}]}","premium_sources":["361966122025900"],"fte_sources":[]}

వారికి వివాహమై కొన్ని క్షణాలు అయ్యిందంతే వివాహ వేడుక ఇంకా పూర్తికాలేదు. అక్కడ వినిపిస్తున్న పాటకు వధువు స్టెప్పులేస్తోంది ఇంతలో వరుడు ఆమెకు ఊహించని షాకిచ్చాడు. మనిద్దరం కలిసుండటం కుదరదంటూ ఆమెకు విడాకులిచ్చేశాడు. ఆ తరువాత, తల్లిదండ్రులతో కలిసి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఇరాక్‌లో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. అతడి అనూహ్య నిర్ణయం గురించి తెలిస్తే మనం మరింత షాకైపోతాం. ఆ వేడుకలో వినిపిస్తున్న పాట అతడికి, తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆ పాట పెడధోరణులను రెచ్చగొట్టే విధంగా ఉందనేది వారి అభిప్రాయం.

ఆ పాట అర్థం అందులోని అంతరార్థం స్పష్టంగానే తెలుస్తున్నా కూడా వధువు తనను తాను మరిచిపోయి చిందేయడం వరుడు భరించలేకపోయాడు. పైచేయి నాదే నీవు నీ కంట్రోల్ లోనే ఉండాలి ఇలా సాగింది ఆ పాట. దీంతో చిరెత్తుకొచ్చిన వరుడు ఈ ఆధిపత్యం భరించలేనంటూ అప్పటికప్పుడు భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు, చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.