నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళలపై ఓ బాలిక ఫిర్యాదు చేసింది. తనను వ్యభిచారంలోకి దింపేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాలిక పొరుగింట్లో ఉండే ఇద్దరు మహిళలు తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.