అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని ఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా పరిధిలో ఆన్లైన్ లో “ IF I WERE THE POLICEMAN” ( నేను పోలీస్ ను అయితే) వ్యాసరచన పోటీలో జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్తులలో మెదటి,రెండవ మరియు మూడవ స్థానాలను పొంది విజేతలయిన విధార్య్తులకు జిల్లా కలెక్టర్ మరియు ఎస్.పి. గార్ల చేతుల మీదుగా జ్ఞాపికలతో పాటు, సర్టిఫికేట్లను అందజేసారు.

అలాగే జిల్లా పోలీస్ అధికారులకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ చూపిన సిబ్బందికి జ్ఞాపికలతో పాటు, సర్టిఫికేట్లను అందజేసారు. అలాగే అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యలో నిర్వహించిన బ్లుడ్ డొనేషన్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,

ఈ కార్యక్రమములో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొనడం అభినందనీయమని, రక్తదానం చేసిన ప్రజలకు జిల్లా ఎస్.పి. గారు అభినందించారు.