శృంగారానికి ఇంటికి పిలిచిన ప్రియుడు నిద్రపోయి తలుపు తెరవకపోవడంతో ప్రియురాలు ఇల్లు తగలపెట్టింది. అతి కష్టమ్మీద ప్రియుడు కిటికీలోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇల్లు మొత్తం కాలిపోయింది. తైజారసెల్ అనే 29ఏళ్ల యువతికి ప్రియుడు ఫోన్ చేసి రాత్రి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అర్థరాత్రి సమయంలో రసెల్ ప్రియుడి ఇంటికి చేరి బెల్ కొట్టింది. 2గంటల సేపు వాకిట్లో నిల్చున్నా నిద్రపోతున్న అతడు లేవలేదు. ఆ తర్వాత 8 దఫాలు ఫోన్ చేసింది అయినా లేవలేదు. దీంతో ఒళ్లుమండి సమీపంలోని గ్యాసొలిన్ స్టేషన్ కి వెళ్లి గ్యాస్ తీసుకొచ్చి ఇంటి ముందు చల్లి తగలపెట్టింది. ఉదయం 4.30 సమయంలో ఇంట్లో మంటలకు నిద్రలేచిన ప్రియుడు బైటకొచ్చే దారిలేక కిటికీ గ్రిల్స్ తీసి దూకేశాడు. ఈ విషయం అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసు ఆమెను స్పాట్ లోనే అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె 8 మిస్డ్ కాల్స్ ఇచ్చినట్టు తేలింది. చివరిగా నన్ను పిలిచి నిద్రపోతావా అంటూ నిన్ను చంపేస్తానంటూ మెసేజ్ కూడా ఇచ్చింది. మెసేజ్ ఇచ్చిన 15నిముషాల్లోనే ఇంటికి నిప్పు అంటించింది. పోలీసులు రసెల్ ను అదుపులోకి తీసుకున్నారు.