నేటి నుండి ప్రారంభమవుతున్న ఐలవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర పోలీసుల భద్రత ఎర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా రవీందర్ పోలీస్ అధికారులతో క్షేత్ర స్థాయిలో సమీక్షా జరిపారు. సుదూర ప్రాంతాలను నుండి జాతరకు తరలివచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా శీఘ్రమే దైవ దర్శనం అయ్యేందుకు రూపోందించాల్సిన క్యూలైన్లతో పాటు భక్తుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు , జాతర ప్రాంగణంలో సి.సి కెమెరాల ఎర్పాటు, వాహనాల పార్కింగ్ స్థలాలు మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ స్థానిక పోలీసు మరియు ఆలయ అధికారులతో చర్చించడంతో పాటు పోలీసులు, అలయ అధికారులు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతం చేయాలని పొలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా జాతర ప్రాంగణంలోని కంట్రొల్ రూంలో సి.సి కెమెరాల దృశ్యాలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు.

అంతకు ముందు ఆలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ ను ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు, పూజారులు పొలీస్ కమిషనర్ కు అందజేసారు.