సర్టిఫికెట్ కోసం వెళ్తే , చేయి చేసుకున్న MRO

క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ కోసం MRO ఆఫీస్ కి వెళ్లిన ఓ యువతిపై, మహిళా తహశీల్దార్ చేయిచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన నాంపల్లిలో చోటుచేసుకుంది. నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత ఆదాయ, కులధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు. ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్నారు.

ఈ సమయంలో ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన తహసీల్దార్‌ KC ప్రమీల, ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహంతో చేయిచేసుకున్నారని సరిత రోదిస్తూ తెలిపింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.

ఈ విషయమై తహసీల్దార్‌ ప్రమీలను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా. తాను ఎవరిపై చేయిచేసుకోలేదని, కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టి సూచించానని తెలిపారు.

అతిలోక సుందరి శ్రీదేవి ,పెద్ద వేషంలో చిన్న కూతురు.