పాక్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళ పైలట్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారికంగా వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా అభినందన్‌ను పాక్‌లో చిక్కుకున్నాడు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. నిన్న భారత ప్రధాని మోదీతో ఫొన్లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ కుదరలేదు. రెండు దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాం. అందుకే అభినందన్‌ను విడుదల చేస్తున్నాం. అంతేకానీ భారత్‌కు భయపడి పైలట్‌ను విడుదల చేయట్లేదు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. దానికి కట్టుబడి అభినందన్‌ను విడుదల చేస్తున్నాం’ అని ఇమ్రాన్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు…