{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584212954101","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584212934828","source":"other","origin":"unknown"}

1. అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా:

లండన్లో అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా సోకింది . న్యుమోనియా వచ్చిందేమోనన్న అనుమానతంతో ప్రసవానికి కొద్ది గంటల ముందే తల్లిని నార్త్ మిడిల్ సెక్సె | ఆసుపత్రికి తలరించాల్సి వచ్చింది . పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లు వెంటనే ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు | నిర్వహించారు . ఈలోపే ఆమె ప్రసవించింది . అయితే టెస్టుల్లో ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అవ్వడంతో వెంటనే డాక్టర్లు . . నవజాత శిశువుకు కూడా కరోనా | పరీక్షలు నిర్వహించగా . . పాజిటివ్ అని తేలడంతో తల్లిని ప్రత్యేక ఆసుపత్రిలో , బిడ్డకు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు . అయితే గర్భంలో ఉండగా కరోనా వైరస్ సోకిందా లేక ప్రసవం తరువాతా అనే ఇంకా తేలాల్సి ఉంది .

2. కరోనా ఎఫెక్ట్ : ఇంటికే పరిమితమైన ఇవాంక:

కరోనా వైరస్ ధాటికి వివిధ దేశాల్లోని ప్రముఖ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు . ఇప్పటికే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో వైద్య పరీక్షలు చేయించుకోగా. నెగెటివ్ గా తేలింది . తాజాగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తులతో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసినట్లు తేలడంతో ఆయనా పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం . ఇక ఇటీవల ఆయన ‘ కుమార్తె ఇవాంక ట్రంతో భేటీ అయిన ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ డుటనకూ కరోనా సోకడంతో ఇవాంక ఇంటికే పరిమితమయ్యారు . అధ్యక్షుడికి | సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆమె శుక్రవారం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు .