బాలల అశ్లీల చిత్రాలను షేర్‌

చేసుకుంటున్నారని 1.3 లక్షల ఖాతాలను వాట్సాప్‌ తొలగించినట్లు గురువారం ప్రకటించింది. భారత్‌తో పాటు వివిధ దేశాల భద్రతా సంస్థల అభ్యర్థనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. వాట్సాప్‌లో ఎన్‌స్క్రిప్షన్‌ కోడింగ్‌ విధానం వల్ల సమాచారం తెలియకున్నా ప్రొఫైల్‌ చిత్రాల ద్వారా కృత్రిమ మేధస్సు (ఎ1) ఆధారంగా వాట్సాప్‌ దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించారు.

ఆండ్రాయిడ్‌ యాప్‌లకు వేదికైన ప్లేస్టోర్‌ నుంచి 85 ప్రమాదకర యాప్‌లను ఇటీవల గూగుల్‌ తొలగించింది. టీవీ రిమోట్‌ కంట్రోల్‌, గేమ్స్‌ పేర్లతో వీటిని దుండగులు ప్లేస్టోర్‌లో పెట్టారు. పైకి ప్రయోజనకరమైన యాప్‌ల్లా కనిపిస్తూనే.. ఇవి స్మార్ట్‌ఫోన్‌ను అదుపులోకి తీసుకుంటాయి. ‘ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌’ అనే ఇలాంటియాప్‌ను చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.