కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమందిని బాధపెడతాయి, కుటుంబాలను రోడ్డున పడేస్తాయి  పిల్లలు అనాధలు కూడా కావచ్చు. అలా ఒక యువతి ఏం చేసిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు ఆమె పేరు మౌనిక 28 సంవత్సరాలు. 10ఏళ్ల కిందట రాంబాబు అనే వ్యక్తితో వివాహమైంది. సంసారం బాగానే సాగుతోంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సంతోషంగా కాపురం చేస్తున్న వారి కుటుంబంలో చిచ్చు రేగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం: ఉమ్మడి మహబూబాద్ జిల్లా నరసింహుల పేట మండలం పరిధిలోని పకీరితండా, ఇక్కడే రాంబాబు మౌనిక నివాసం ఉండేవారు.

వీరు బాగానే ఉన్నారు కానీ రాంబాబు తల్లిదండ్రులు ఈమెను 10ఏళ్ల తర్వాత అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలుపెట్టారు. అలా రాంబాబు కూడా భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇక రోజు రోజుకు వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో మనస్థాపం చెందిన మౌనిక ఇంట్లో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మీరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.