పదేళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు పన్నెండేళ్ల బాలుడు. తరుచు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. మహారాష్ట్రలో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

పల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో పదేళ్ల బాలికపై అదే గ్రామంలో ఉండే పన్నెండు ఏళ్ల కుర్రాడు అఘాయిత్యానికి పాల్పాడ్డాడు. పదే పదే ఆ బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఆ బాలికకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆ బాలికను దగ్గరలోని హాస్పటల్‌కి తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. బాలికకు పరీక్షలు చేసిన డాక్టర్లు. ఆమె గర్భవతి అని చెప్పటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు తల్లిదండ్రులు. ఏం జరిగిందో చెప్పమని బాలికను విచారించగా.. బయపడిన ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి బోరునా ఏడ్చేసింది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.