100 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

తన అమ్మమ్మ, నానమ్మ వయసున్న ఓ వృద్ధురాలిపై అతి క్రూరంగా అత్యాచారం చేశాడు 20 ఏళ్ల మృగాడు. మానవత్వం మరిచిన ఈ మృగాడు.  వందేళ్ల పండు ముసలమ్మపై కామంతో చెలరేగిపోయాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేస్తుండగా. యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఆ తర్వాత చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని గంగాప్రసాద్‌పూర్‌కు చెందిన అభిజిత్‌గా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ఇదే బెంగాల్‌లో రెండు రోజుల క్రితం జల్పైగురి జిల్లాలో భూవివాదం పరిష్కరించుకుందామని పిలిచి, మహిళపై అత్యాచారం చేసి, ఆమె ప్రయివేటు భాగాలను ఇనుపరాడ్లతో గాయపరిచిన సంగతి తెలిసిందే.