పత్రికా ప్రకటన తేది: 30-12-18

Advertisement

100 టీంలతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీలు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ నూతన సంవత్సర వేడుల సందర్బంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు వందకుపైగా డ్రంక్‌ డ్రైవ్‌ టీంలు విధులు నిర్వహిస్తారని వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ నగర ప్రజలకు సూచించారు.

ముఖ్యంగా గత అనుభవాల దృష్టా యువత మద్యం సేవించి నిర్లక్ష్య ధోరణితో వాహనాలను అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పాటు కోన్ని సందర్బాల్లో వాహనదారులతో పాటు సాధరణ ప్రజలు తీవ్ర గాయాలకు గురై ఆకాలంగా మరణిస్తున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నియంత్రణకై కమీషనరేట్‌ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నగరంలో ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించబడుతుందని. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇందుకోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో మొబైల్‌ పోలీస్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్థర్‌ పోలీస్‌ విభాగాలతో 100 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టీంలతో తనీఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారీకెడ్లను ఏర్పాటు చేయబడుతాయని.

  • ఈ తనీఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా గుర్తించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనదారులను కోర్టులో హజర్‌ పర్చడం ద్వారా వాహనదారుడికి జరిమానా లేదా జైలు శిక్షను విధించడంతో పాటు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణ రక్షణతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వుంది కాబట్టి వాహనంను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.

  • అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరుకు మించి ఎక్కువ మంది ప్రయాణించడంతో పాటు రోడ్లపై కాలినడకన, వాహనాలపై వెళ్ళేవారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై పోలీస్‌ చర్యలు తప్పవని,
  • మధ్యం విక్రయ కేంద్రాలు నిర్ణిత సమయం దాటిన అనంతరం ఎవరుకూడ అమ్మకాలు నిర్వహించవద్దని. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఎలాంటి డి.జేలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, రెస్టారెంట్లు, ¬టళ్ళలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకుగా ఏలాంటి పోలీసుల అనుమతులు లేవని స్పష్టం చేసారు.
  • ఆర్థరాత్రి 2గంటలకు వరకు లారీలు, ఇతర భారీ వాహనాలు నగరంలోనికి రావడానికి నిషేంధిచడం జరిగిందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
  • ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యుల నడుమ సంతోషాలతో నిర్వహించుకోవాలని,
  • రాబోవు కోత్త సంవత్సరంలో ప్రజలు తాము నిర్థేషించుకున్నా లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలకు నేలవు కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ తరుపు ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలను పోలీస్‌ కమీషనర్‌ తెలియజేసారు.