14 సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి

ఆలేరులో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో 14 సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక బిందు మరణం అనుమానాస్పదంగా మారింది. ఆలేరులోని ‘బ్యాక్ టు బ్యాక్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో కేతావత్ బిందు అనే బాలిక ఉంటోంది. బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బిందు కళ్లు తిరిగి పడిపోయి చనిపోయిందని హాస్టల్ నిర్వాహకుడు దేవదాస్ అంటున్నాడు.

బిందు కొంతకాలంగా అనారోగ్యంతో ఉందని అయినా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదని సమాచారం తెలుస్తోంది. హాస్టల్ మీద కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిందు మరణంపై సమగ్ర విచారణ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.