ఆశలు తీరలేదు – అందుకే లోకం విడిచి పోతున్నా

తేలిసీ తేలియని వయసులో తాళికట్టించి ఆమె ఆశలకు ,ఆశయాలకు ఉరితాడు వేశారు. స్నేహితులు చదుకుంటుంటే ఆమె మాత్రం సంసారబంధనాల్లో , తాను IPS కావాలనే ఆశను చంపుకొని భర్తతో కష్టాలు , కన్నీళ్ళతో , బిడ్డలతో సంసార సమరం చేసింది…

ఆమె వేదనకు ఇలా అక్షర రూపం ఇచ్చింది..

‘‘ నాకు ఉన్నత చదువులు చదువుకోవడంతోపాటు మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని భర్తతో కలిసి తిరగాలని ఉండేది. కాని మానాన్న 16 సంవత్సరాలకే పెళ్లి చేసి పంపాడు. చదువు ఇంటర్‌తోనే ఆపాల్సి వచ్చింది. నా జీవితంలో చాలా కోల్పోయాను. తల్లిదండ్రులెవరూ బాల్యవివాహాలు చేయకండి. మామయ్య (భర్త తండ్రి) నా పిల్లలను మాత్రం బాగా చదివించండి. బిట్టు, సాయి బాగా చదువుకోండి’’ అంటూ లేఖ రాసి సూసైడ్‌ నోట్‌ చివర తన పేరు గీతాంజలి, ఐపీఎస్‌ అని వ్రాసింది.

పోలీసుల కథనం ప్రకారం : ఆదిలాబాద్‌కు చెందిన గీతాంజలి(26)కి 16 సంవత్సరాల వయస్సులోనే నిర్మల్‌ లక్ష్మీపురానికి చెందిన శంకర్‌(30)తో వివాహమైంది. భర్త ప్రైవేటు ఉద్యోగ రీత్యా ముంబయిలో ఉంటారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె హైదరాబాద్‌లోని కొత్తపేటలో అద్దెకు ఉంటూ దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీస్‌ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగకు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన గీతాంజలి వారిని తల్లిదండ్రుల వద్దే ఉంచి శుక్రవారం కొత్తపేటకు చేరుకుంది. జీవితంలో తాను అనుకున్నది ఏదీ సాధించలేకపోతున్నాననే వేదనతో గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది.

నా జీవితంలో చాలా కోల్పోయాను. తల్లిదండ్రులెవరూ బాల్యవివాహాలు చేయకండి…

ఆమె చెపింది మీకు నిజం అనిపిస్తే “షేర్” చేసి ఇలాంటి ఘటనలు కాకుండా చేద్దాం ??