యాదాధ్రి శ్రీలక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి.
రాష్ట్రంలో 16 ఎమ్పీ స్థానాల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమంటూ వెల్లడి.
( ) బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు యాదాధ్రి శ్రీలక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఎన్నికలకు ముందు తనకు ఇష్టదైవమైన శ్రీలక్ష్మినర్సింహాస్వామిని దర్శించుకోవడం అనవాయితీ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 16 ఎమ్పీ స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనను దేశప్రజలు కోరుకుంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల పలితాల్లో ప్రజల కోరికను తీర్చేవిధంగా, దేశ రాజకీయాల్లో సియం కేసిఆర్ పాత్ర కీలకం అయ్యేవిధంగా చూడాలని వేడుకున్నట్లు చెప్పారు.