2 నెలల పసి పాపకు పాలిచ్చి ఆకలి తీర్చిన లేడీ పోలీస్

పోలీసులంటే కఠినాత్ములనే పేరుంది. పోలీసులంటే చావగొడతారనే భయముంది. కానీ అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అని రుజువు చేశారు. పోలీస్ దంపతులు. వారి మనసుల్లో మానవత్వానికి చోటుందని నిరూపించారు. గుర్తుతెలియని రెండు నెలల పాపకు తల్లి రూపంలో అండగా నిలిచిన మహిళా కానిస్టేబుల్. గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారికి పాలు అందించి ఆకలి తీర్చారు.