{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580699035834","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580699012348","total_effects_time":0,"brushes_used":0,"height":1548,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి కలెక్టర్ల బదిలీలు జరిగాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా మినహా మిగతా జిల్లాలకు నూతన పాలనాధికారులు వస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ పాలనాధికారిగా పనిచేస్తున్న రాజీవ్‌గాంధీ హనుమంతు వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు వస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నల్గొండకు బదిలీ అయ్యారు. ములుగు జిల్లా పాలనాధికారిగా ఉట్నూరు ఐటీడీఏ పీవోగా ఉన్న కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు.

Advertisement

మేడారం జాతర నేపథ్యంలో ఇటీవలే ఈ జిల్లాకు ఆర్‌.వి.కర్ణన్‌కు పూర్తి అదనపు బాధ్యత ఇచ్చిన విషయం తెలిసిందే. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకి బదిలీ కాగా, ఆయన స్థానంలో యూత్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

మహబూబాబాద్‌ కలెక్టర్‌గా భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌ రానున్నారు. సంగారెడ్డి జేసీగా పనిచేస్తున్న కె.నిఖిల జనగామ పాలనాధికారిగా బదిలీ అయ్యారు. జనగామ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సూర్యాపేట పాలనాధికారిగా వెళ్తున్నారు. ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారిగా ఖమ్మం ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న జె.హనుమంత్‌ కొండిబా నియమితులయ్యారు. వరంగల్‌ రూరల్‌ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న బాదవత్‌ సంతోష్‌ బదిలీపై జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా వెళ్లనున్నారు.