16 ఏళ్ల బాలిక ఫై 4 ఏళ్లగా కొంతమంది యువకులు అత్యాచారం చేయడం అందర్నీ షాక్ లో పడేసింది.
హైదరాబాద్ కామాటిపురా, గొల్లాకిడికి చెందిన బాలికపై కొందరు యువకులు గత కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే ఈ వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి , 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూ వస్తున్నారు.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడం తో వైద్య పరీక్షలు చేపిచ్చారు..
అయితే వైద్య పరీక్షలు రిపోర్టులు చూసి డాక్టర్లు నిర్ఘాంతపోయారు. నిందితులు బాలికపై 4 సంవత్సరాల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు రిపోర్టుల్లో వెల్లడైంది. ఇంతటి దారుణానికి పాల్పడిన మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బస్తీవాసులు ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది ఆందోళనకారులు కామాటిపురా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు…