1990లో వచ్చిన ‘మనసు మమత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సితార. తరువాత ‘జీవన చదరంగం’, ‘గంగ’, ‘శ్రీవారి చిందులు’ ‘శుక్రవారం మహాలక్ష్మి’ ‘మా వారికి పెళ్ళి’ ‘అక్క చెల్లెళ్ళు’ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార ఓ మలయాళీ అమ్మాయి అంటే అప్పట్లో ఎవ్వరూ నమ్మలేదట. నిజానికి మనం కూడా నమ్మలేము అనే చెప్పాలి. అంతలా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పోయింది సితార. అవును సితార సొంత ఊరు కేరళకు చెందిన కిలి మనూరు. ఇప్పటి వరకూ తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా సితార నటించింది. అంతేకాదు సీరియల్స్ లో కూడా నటించింది. అయితే 46 ఏళ్ళ వయసు దాటినా ఈమె పెళ్ళి చేసుకోలేదు అంటే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. దానికి కారణం కూడా సితార ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతుః

”మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాల్లో నేను ఆయన సలహాలు తీసుకునేదాన్ని. ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చేవారు. ఏ పని చేయాలని నేను అనుకున్నా ఆయనకి చెప్పే చేసేదాన్ని. నాకు అంత ఇష్టమైన మా నాన్న గారు సడన్ గా మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. దాంతో నేను కొన్నాళ్ల పాటు ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ టైములో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాను. తరువాత ఆ బాధను మరిచిపోవడానికి ఖాళీ లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో పెళ్ళి గురించి కూడా ఆలోచించలేదు. ఒకవేళ భవిష్యత్తులో పెళ్ళి చేసుకుంటే మాత్రం కచ్చితంగా మీడియా వారికి చెప్పే చేసుకుంటాను” అంటూ సితార చెప్పుకొచ్చారు.