ఎన్నో కలలు, కొత్త జీవితంపై మరెన్నో ఆశలతో ఒక్కటైన జంట పెళ్లి చేసుకుని గట్టిగా 6 నెలలు గడిచే లోపే ఏం జరిగిందో ఏమో వారిద్దరి జీవితాలూ విషాదాంతమయ్యాయి. కట్టుకున్న వాడే తుపాకీతో తూట్లుగా కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్‌లోని సీతామాఢీ సిటీలో ఈ దారుణం జరిగింది.

ఒక జవాన్‌ తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్‌లోని సీతామర్హి నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే: చంద్రభూషణ్‌ పాండే క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌(క్యూఆర్‌టీ) జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న చంద్రభూషణ్‌ మొదట తన భార్య మధును తుపాకీతో ఏడు సార్లు కాల్చి ఆపై తానూ షూట్‌ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. వీరి వివాహం జరిగి ఆరు నెలలు కావొస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 3-4 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు…