65 ఏళ్ళ ప్రియుడు !
20 ఏళ్ళ ప్రియురాలు !
ఇదేమి ఖర్మ
ఇది ప్రేమో , వ్యామోహమో , మోసమో తెలియనిపరిస్థితి .. 65 ఏళ్ళ ముసలోడి వలలో పడి పారిపోయివచ్చిన అమ్మాయి మాది పవిత్రప్రేమ అని చెప్తోంది..
పంజాబ్ రాష్ట్రంలోని అపోకర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జయ్‌కృష్ణన్ (65) తన వద్ద ట్యూషన్ వచ్చే మగత్ (20) అనే విద్యార్థినిపై మమకారం పెంచుకున్నాడు. భార్య చనిపోగా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను కలిగి ఉన్న జయ్‌కృష్ణన్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో మగత్‌ను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు. రిటైరైన తరువాత కూడా మగత్‌కు ఆర్థిక సహకారం చేయడం, ఇంటికి పిలిపించుకుని మరీ ట్యూషన్లు చెప్పడం, ఇద్దరూ కలిసి భోంచేయడం పరిపాటిగా తయారై ప్రేమగా మారింది.
ఈనెల 11వ తేదీన జయకృష్ణన్ రూ.25వేల తన పింఛన్ సొమ్ముతోపాటు ఇంటిలోని నగదును తీసుకురాగా ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ రెండురోజుల క్రితం తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు. తండ్రి, కుమార్తెలమని చెప్పి ప్రయివేటు అతిథిగృహంలో రూము తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్, రామేశ్వరం పోలీసులకు బుధవారం వారు పట్టుబడ్డారు. ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో ఏడాది క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకుని రహస్య కాపురం సాగిస్తున్న విషయం బయటపడింది. ఎన్నాళ్లీ దొంగకాపురం, స్వేచ్ఛగా కలిసి జీవిద్దామనే ఆలోచనతోనే పంజాబ్ నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడ్డారు.
‘మాది పవిత్ర ప్రేమ’జయకృష్ణన్, మగత్
మాది పవిత్రమైన ప్రేమ, తప్పుపట్టే పని మేం చేయలేదని వారిద్దరూ పోలీసుల వద్ద సమర్థించుకున్నారు. ‘‘శారీరక సుఖం కోసం మగత్‌ను పెళ్లి చేసుకోలేదు, భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న నాపై మగత్ అత్యంత అభిమానం చూపించింది. ఇదే మాఇద్దరి మధ్య ప్రేమకు కారణం’’ అని జయకృష్ణన్ చెప్పాడు. ‘‘చిన్నవయసు నుంచే నా పట్ల చూపిన ఆదరణే జయకృష్ణన్ అంటే విలువపెంచేలా చేసిందని మగత్ తెలిపింది. కాలక్రమేణా నాకు తెలియకుండానే ఆయనంటే ప్రేమ ఏర్పడింది.
నా ప్రేమ తప్పని తెలిసినా ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. బతికితే అతనితోనే బతుకుతాను, భర్తను నా నుంచి విడదీయవద్దు’’అని పోలీసుల వద్ద మగత్ పెద్దగా విలపించింది