స్టేషన్ ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజయ్య!

పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం’ అని అనకుండా మనది అనాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.

టీఆర్‌ఎస్‌ బలపడాలన్నా, కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.

ఈ రోజు హన్మకొండ లో జరిగిన స్టేషన్ ఘాణపురం ముఖ్యకార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారితో పాల్గొన్న వరంగల్ పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్ ,

ఎంపి, గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అందరు గ్రూపులుగా కాకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు