9నుంచి బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభమవుతుందని శ్రీ భద్రకాళీ దేవ స్థాన ఆస్థాన సిద్ధాంతి, కాజీపేట శ్వేతారాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఐనవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలకు బియ్యం ఇచ్చే పితృ అమవాస్యను కూడా ఇదే రోజు మంగళవారం జరుపుకోవాలని సూచించారు. సోమవారం 8వ తేదీన చతుర్దశి తిథి ఉదయం 10.40 గంటల వరకు ఉండి తరువాత అమవాస్య తిధి ప్రవేశిస్తుందని,9వ తేదీన సూర్యోదయం నుంచి ఉదయం 8.59 గంటల వరకు అమవాస్య ఉన్నందున అప రాహ్ని కాలమైన పగలు 12.40 గంటల వరకు బియ్యం ఇచ్చుకోవచ్చునని తెలిపారు.

దేవీ నవరాత్రోత్సవ ఆరంభ కలిశ స్థాపన పూజలు 10వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించాలని పేర్కొన్నారు