భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల విషయానికి వస్తే ఇన్వెస్టిగేటర్లు 350 ఖాళీలు, సూపర్ వైజర్లు 150 ఖాళీలు ఉన్నాయి. బ్చాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, స్ధానిక భాష తెలిసి ఉండాలి.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించటానికి చివరి తేదిగా 2022 జనవరి 25ను ఖరారు చేశారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.becil.com